జీవితం అంటే శృంగారం ఒక్కటే కాదు

జీవితం అంటే శృంగారం ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. నా పేరు రామ్మోహన్. నాకు పెళ్లయి పదిహేనుళ్లు అవుతుంది. నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఈ అంశానికి సంబంధించి చాలా విషయాలు గమనించాను. శృంగారం అంటే బూతు అని నేను చెప్పను. కొందరు శృంగారం అంటే బూతు అనుకుంటారు. అస్సలు కాదు. అది భార్యాభర్తలకు దివ్యఔషదమని కొందరు సెక్సాలజిస్ట్ లే చెబుతుంటారు. అయితే శృంగారం అనే ఒకే ఒక్క దాని వల్లే ఎన్నో అరాచకాలు కూడా జరుగుతున్నాయి.

తప్పుటడుగు వేస్తే మాత్రం చాలా ఇబ్బందులు

దాన్ని సక్రమంగా చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఆ విషయంలో తప్పుటడుగు వేస్తే మాత్రం చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అలాగే జీవితాలు కూడా నాశనం అవుతాయి. ఈ మధ్య మనం చూస్తున్నట్లుగా ఎంతో మంది భార్యలు భర్తల్ని హత్యలు చేయడం, చాలా మంది భార్యాభర్తలు విడిపోవడానికి కారణం కేవలం శృంగారం ఒక్కటే.

శృంగారం కూడా అంతే అవసరం

ప్రతి వ్యక్తికి ఎక్సర్ సైజ్ ఎంత అవసరమో అలాగే శృంగారం కూడా అంతే అవసరం. భార్యాభర్తలు అందులో పాల్గొని దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఆడ, మగ మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగేందుకు సెక్స్ బాగానే ఉపయోగపడుతుంది.

శృంగారం అనేది మానసికఒత్తిడిని దూరం చేస్తుంది.

భార్యాభర్తల మధ్య ఉండే సమన్వయం కూడా ఇది ఏర్పరచగలదు.

భార్యాభర్తల మధ్య ఇది అవసరం

అందుకే ప్రతి భార్యాభర్తల మధ్య ఇది చాలా అవసరం. అందులో ఎంత ఎక్కువగా పాల్గొంటే అంత బంధం బలపడుతుంది. ఆ సమయంలో బాడీలో కొన్ని రకాల హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీంతో ఒకరిపై ఒకరికి ప్రేమ పెరిగిపోతుంది.అయితే లైఫ్ లో సెక్స్ అనేది ఒక పార్ట్ కావాలిగాని అదే జీవితం కాకూడదు.

ఇరవైనాలుగు గంటలు అందులోనే

ఎందుకంటే మన దైనందిక జీవితంలో ఇంకా చాలా పనులుంటాయి. వాటినన్నింటినీ కూడా మనం పట్టించుకోవాలి. అలా కాకుండా కొందరు మగవారు ఇరవైనాలుగు గంటలు అందులోనే మునిగిపోయి దాన్నే ఎంజాయ్ చేయాలనుకుంటారు. అది మంచి పద్దతి కాదు.

ఏ అమ్మాయితో పరిచయం కలిగినా అదే వంకతో

ఇక కొందరైతే తమకు ఏ అమ్మాయితో పరిచయం కలిగినా అదే వంకతో ఆమెతో మెలుగుతుంటారు. ఎప్పుడెప్పుడు శారీరకంగా కలుద్దామా అన్నట్లు ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తారు. అయితే ఇది మంచి పద్దతి కాదు. అమ్మాయి పరిచయం అయ్యాక ఆలోచన మొత్తం దానిపైనే ఉంటే మీకు జీవితంలో ఏ అమ్మాయి కూడా దగ్గర కాదు. ఎందుకంటే అందరినీ అదే కోణంలో చూడడం అనేది తప్పు.

శృంగారంపైనే ఫోకస్

ఇంకొందరు యువకులు ఎక్కువగా శృంగారంపైనే తమ ఫోకస్ పెడుతుంటారు. దీంతో వారిలో ఉన్నటువంటి ఇతర టాలెంట్స్ మొత్తం కూడా మరుగునపడిపోతాయి. కొందరు దానికే బానిసలవుతుంటారు. తాత్కాలిక ఆనందం కోసం తప్పుటడుగులు కూడా వేస్తుంటారు.

పైకి బాగానే మాట్లాడుతూ

మరికొందరు పరిచయం అయిన అమ్మాయిలతో పైకి బాగానే మాట్లాడుతుంటారు కానీ లోపల మాత్రం అన్నీ ఆ ఆలోచనలే ఉంటాయి. అలాంటి థాట్స్ మొత్తాన్ని కూడా నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. అలాంటి ఆలోచలను మనిషిని నాశనం చేస్తాయి. మీరు అస్సలు మీ ఆలోచనలను కంట్రోల్ చేసుకోలేకపోతుంటే మాత్రం రోజూ యోగా చేయడం మొదలుపెట్టాలి. లేదంటే భక్తికి సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టాలి.

మీరు అనుభవిస్తే తెలుస్తుందని ప్రశ్నించొచ్చు

మీరు బాగానే చెబుతారు… మీరు అనుభవిస్తే తెలుస్తుంది అని మీరు ప్రశ్నించొచ్చు. నేను అనుభవించిన సంఘటనలే మీకు చెబుతున్నాను. నేను కూడా నా యవ్వనంలో అలాగే ప్రవర్తించేవాణ్ని. పెళ్లయిన తర్వాత నా భార్య అందుకు తప్ప ఇంకెందుకు పనికిరాదన్నట్లుగా, కేవలం ఆ పని పూర్తికాగానే ఆమెను ఇంట్లో వదలి బయటికి వెళ్లి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవాణ్ని.

నా భార్య నాపై చూపుతున్న ప్రేమ

రానురాను నాకు ఒక విషయం తెలిసింది. నా భార్య నాపై చూపుతున్న ప్రేమలో నేను కనీసం ఒక్కశాతం కూడా ఆమెపై చూపలేదని. నేను ఎంతసేపున్నా తనను ఒక శృంగారపు బొమ్మ మాదిరిగానే చూశాను. కానీ తర్వాత తెలిసింది తనని నేను ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేసి ఎంత పెద్ద తప్పు చేశానని. ఈ ప్రపంచంలో నీకు ఏమైనా అయితే తల్లిడిల్లిపోయేది ఒక్క భార్యమాత్రమేనని గుర్తించుకో. అలాగే ప్రతి భార్య కూడా భర్తకు కూడా అలాగే గౌరవం ఇవ్వాలి. ఇలా చేస్తే ప్రతి జీవితం ఆనందమయమే.

184 total views, 2 views today